చిత్తూరు,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలపై జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పక్షాలతో భన్వర్‌లాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల పమోదులో అవకతవకలపై పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన భన్వర్‌లాల్ సెప్టెంబర్ కల్లా ఓటర్ల కొత్త జాబితాను ప్రకటిస్తామన్నారు. దానిలో ఏమైనా సవరణలుంటే పరిశీలించి జనవిర 1 కల్లా తుది జాబితాను సిద్దం చేస్తామని భన్వర్‌లాల్ వెల్లడించారు.




