Wednesday, 4 November 2026

చిత్తూరు మేయర్ దంపతుల దారుణ హత్య..

1చిత్తూరు : నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్య గావించబడ్డారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధ, ఆమె భర్త మోహన్ లపై ముగ్గురు దుండగులు బుర్ఖాలో వచ్చి.. కత్తులతో దాడి చేసి.. ఆపై తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనురాధ, మోహన్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అనురాధ మృతి చెందింది. మోహన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. చికిత్స పొందుతూ మోహన్ మృతి చెందారు. ఈ దాడికి పాతకక్షలే కారణమని భావిస్తున్నారు. నిందితులు కర్ణాటకకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. జిల్లా ఎస్పీ, యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనురాధ, మోహన్ లకు బలమైన అనుచరగణం ఉండడంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే అనురాధ దంపతులపై దాడి చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులు ఒన్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. నిందితులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *