ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 19(జనంసాక్షి)-
ప్రయివేటు వృత్తి విద్యా కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయని గవర్నర్ నరసింహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాలేజీలు కేవలం డబ్బుకోసమే వెలియటం విచారకరమన్నారు. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రాంగణంలో 29వ ఇండియన్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యాపార వస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.





