Tuesday, 3 November 2026

చెక్‌డ్యాంలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

మార్టూరు : ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని రాజుపాలెంలో సైకిలు కడిగేందుకు చెక్‌డ్యాంలోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణచైతన్య (14), పృథ్వీ (14), మరో విద్యార్థి సైకిలు కడిగేందుకు చెక్‌డ్యాం వద్దకు వెళ్లారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు డ్యాంలోకి దిగి నీటిలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు స్థానికల సహాయంతో ఇద్దరి మృతిదేహాలను వెలికితీశారు. ఘటనపై వివరాలను సేకరిస్తున్నామని ఎస్సై మల్లికార్జున్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *