– నిలిచిన విమాన, రైలు, రోడ్డు సేవలు
– స్థంభించిన జనజీవనం
చెన్నై/విశాఖపట్నం,డిసెంబర్ 2 (జనంసాక్షి):
బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వరకు ఏర్పడిన అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా తమిళనాడు కోస్తాతీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు భార వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. నడుం లోతు నీళ్లలో నగరం మునిగిపోయింది. విమానాశ్రయానికి వరదపోటెత్తింది. భారీ వర్షాల కారణంగా రాజధాని చెన్నై నగరం భారీవర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. నగరంలో ఎటు చూసినా నడుంలోతు, పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నా.. వాళ్లు కాలు కదిపేందుకు కూడా వీలు కుదరడం లేదు. దీంతో సహాయక చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వర్షాలకు రిజర్వాయర్లన్నీ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. దాంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో హాయ చర్యలకు కూడా వీలుకానంత పరిస్థితి ఏర్పడింది.శివార్లలో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది కూడా నిండిపోయి, ఆ వరదనీరు చెన్నై నగరంలోకి చేరుకుంది. వాహనాలేవీ కదల్లేని పరిస్థితి ఏర్పడి, వాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అన్ని రహదారులలో పడవల్లో మాత్రమే తిరగగలిగే అవకాశం ఉంది. వరదనీటిలో చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వీలు కావట్లేదుఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా, ఎప్పటికప్పుడు వరదనీరు పెరుగుతుండటంతో వాళ్లు ఏవిూ చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేశారునగరంలోని చాలా ప్రాంతాల్లో ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఎప్పుడూ సురక్షితం అనుకునే విమానాశ్రయం వరదనీటితో మునిగిపోయింది. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే 70 వేల మంది సిబ్బంది సహాయపనుల్లో ఉన్నారు.అయినా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యం కావట్లేదు. అడయార్ నది కూడా పొంగడంతో శివార్లలో ఉన్న 4 లక్షల ఇళ్లు నీటమునిగాయి. నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితి నెలకొంది.ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి. ఇళ్లలో ఉండేవాళ్లు మొదటి లేదా రెండో అంతస్థులకు వెళ్లి తలదాచుకుంటున్నారు. పరిస్థితి ఎన్నాళ్లనేది తెలియడం లేదు. చెన్నైలోని 24 జోన్ కార్యాలయాలతో పాటు అన్నిచోట్లా బృందాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వాళ్ల వాహనాలు కూడా కదిలే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ పరిస్థితిపై సీఎం జయలలితతో ప్రధాని మోదీతో చర్చించారుకేంద్ర మంత్రివర్గం కూడా చెన్నై పరిస్థితిని సవిూక్షించింది. భారీవర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం సాయం చేయడానికి కూడా ఏమాత్రం వీలుండకపోవచ్చన్న భయాందోళనలు నెలకొంటున్నాయి. నగరం వదిలి వెళ్లిపోదామన్నా.. ఇంట్లోంచి బయటకు కాలు పెట్టలేకపోవడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి చెన్నైలో ఉంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం మధ్య చెన్నైలో అత్యధికంగా 25 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వర్గాలు తెలిపాయి. ద్రోణి స్థిరంగా కొనసాగుతున్నందున, బుధవారం కూడా అదే స్థాయిలో వర్షాలు కురిసాయి. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలపైనా ఉంటుందని అధికారులు తెలిపారు. చెన్నైలో భారీ వర్షాల
కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. వర్షాల కారణంగా తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై-తిరుచ్చి మార్గంలో గూడూవాంజేరి వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో చెన్నై-బెంగళూరు మార్గంలో వాహనాలు మళ్లించారు.చెన్నైలోని పలు కీలక ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చెన్నై నగరం గాడాంధకారంలో చిక్కుకుంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలకు చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. నిత్యావసరాలు, తాగునీరు అందుబాటులో లేక జనం అల్లాడుతున్నారు. చెన్నైలో మరో నాలుగురోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. తమిళనాడులోని 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలకు చెన్నైలోని తాంబరం విమానాశ్రయం జలమయమైంది. రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరడంతో తాంబరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విమానాశ్రయం సవిూపంలో కూడా
వాహనాల రాకపోకలు స్తంభించాయి. చెన్నై నగరంలోని కీలక ప్రాంతాలైన కోడంబాక్కం, వడపళని, టి.నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శానిటోరియం, పల్లవరం, క్రోమ్‌పేట్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రాజా స్టీల్పాక్కం చెరువుకు గండి పడింది. అడయార్, ఇందిరానగర్ మెయిన్‌రోడ్డులో నీటి ఉద్ధృతితో తాగునీటిపైప్లైన్ పగిలింది. పైప్‌లైన్ నుంచి 6అడుగుల ఎత్తున నీరు ఎగజిమ్ముతోంది. అడయార్, కోవం నదుల ప్రాంతాల్లో వరద ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అడయార్ ప్రాంతంలో 2వేల ఇళ్లను అధికారులు ఖాళీ చేయించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. చెన్నైలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. చెన్నై-తిరుచ్చి మార్గంలో గూడూవాంజేరి వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో చెన్నై-బెంగళూరు మార్గంలో వాహనాలు మళ్లించారు.
సెలవు ప్రకటించిన ఐటీ కంపెనీలు
ఐటీ కంపెనీలు వానతో హడలిపోయాయి. ఐటీ కారిడార్‌లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎ/-టసీరోడ్డు, తిరువాన్మియారు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల కార్యాలయాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా సంస్థలు సెలవు ప్రకటించాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో బయటికొచ్చే మార్గంలో ఉద్యోగులు చాలామంది కార్యాలయాల్లోనే ఉన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంటిన్లో బల్లలు, కుర్చీలు వాన నీటిలో తేలియాడుతూ కనిపించాయి.
విమానాశ్రయాన్నిముంచెత్తిన వరద
భారీ వర్షాల కారణంగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చిన్నపాటి నదిలా మారిపోయింది. దాంతో విమానాలు కాస్తా పడవల్లా తేలుతున్నాయి. వరుసగా పార్కింగ్ చేసిన విమానాలు దూరంగా పడవల్లా కనిపిస్తుంటే కేవలం చెన్నై వాసులే కాదు.. భారతీయులంతా విస్తుపోతున్నారు. చెన్నై విమానాశ్రయం మొత్తం నీళ్లతో నిండిపోవడంతో విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. ఇక చెన్నై విూదుగా వెళ్లాల్సిన 19 రైళ్లు కూడా రద్దయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. అడయార్ నదివిూద ఉన్న వంతెన పై నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. నగరంలో ప్రజలు ఎటూ కదలడానికి వీల్లేకుండా పోయింది.లక్నో నుంచి చెన్నై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై సవిూపంలో రైలు పట్టాలపై వరద నీరు ప్రవహిస్తున్నందున రైలు నిలిపివేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. గువాహటి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గువాహటి ఎక్స్‌ప్రెస్ వర్షం కారణంగా నిలిచి పోయింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం రైల్వే స్టేషన్ సవిూపంలో ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన రైల్వే యంత్రాంగం రైలును స్టేషన్లో నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షాలు.. వరదలతో చెన్నై నగరంలోని ఐటీ కంపెనీలు మూతపసడ్డాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో కంపెనీల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో కంపెనీలు సెలవులు ప్రకటించాయి. ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారికి తగు జాగ్రత్తలను సూచించారు. చాలామంది ఆఫీసుల్లో చిక్కుకుని పోయారు. పనులు, ప్రాజెక్టుల షెడ్యూళ్లు దెబ్బతినకుండా బిజినెస్ కంటిన్యుటీ ఎ/-లాన్స్‌తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూనే, ఉద్యోగుల భద్రత విూదా దృష్టిపెట్టాయి. ఐటీ కారిడార్‌లోని ఓఎంఆర్ రోడ్డు, వేళచ్చేరి, తాంబరం, తరమణి, జీఎ/-టసీరోడ్డు, తిరువాన్మియారు, కేళంబాక్కం తదితర ప్రాంతాల్లోని ఐటీ సంస్థల కార్యాలయాలు జలమయమయ్యాయి. దీంతో పలు సంస్థలు సెలవు ప్రకటించాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లో టీసీఎస్కి మొత్తం 13 కార్యాలయాలున్నాయి. మంగళవారం కొన్నిటిని తాత్కాలికంగా మూసివేసినా మిగిలినవాటిని పాక్షికంగా మధ్యాహ్నం ఒంటిగంటవరకు మాత్రమే పనిచేయించారు. తమ సొంత క్యాబ్‌లు, బస్సుల్లో ఉద్యోగులను ఇళ్లకు చేర్చారు. బుధవారం పరిస్థితిని బట్టి ఏ విషయమూ ముందుగానే తెలియజేస్తామని సంస్థ ఉద్యోగులకు ఒక నోట్ పంపించింది. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగులు మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు విధులు నిర్వర్తించారు. కంపెనీల చుట్టూ నీరు చేరడంతో బయటికొచ్చే మార్గం లేక చాలామంది కార్యాలయాల్లోనే ఉన్నారు. ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంటిన్లో బల్లలు, కుర్చీలు వాన నీటిలో తేలియాడుతూ కనిపించాయి. కొన్ని కంపెనీలు ప్లెక్సిబుల్ వర్క్ షెడ్యూళ్లు అమలు చేస్తోంటే మరికొన్ని హైదరాబాద్, ముంబయి, పుణె తదితర నగరాల్లో ఉన్న తమ శాఖల ఉద్యోగులతో విధులు నిర్వర్తిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 7వ తేదీ నుంచి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించాల్సిన అర్ధవార్షిక పరీక్షలను వాయిదా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు కూడా మూతపడ్డాయి. చాలా ప్రైవేట్ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హిందూ దినపత్రిక ఎడిషన్ ప్రింట్ కాలేదు. దీంతో ఎక్కడిక్కడే పనులు స్తంభించాయి.
చెన్నైలో రంగంలోకి దిగిన ఆర్మీ
కొనసాగుతున్న సహాయక చర్యలు
జలదిగ్బంధంలో ఉన్న చెన్నై నగరంలో సహాయక చర్యల కోసం సైన్యం, వైమానిక దళం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. అలాగే విశాఖ నుంచి ఐఎన్ఎస్ ఐరావత్ కూడా బయలుదేరింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నగరమంతా జలమయం కావడంతో వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాటు పడవలతో నీటిలో చిక్కుకున్న వారిని సినిమాహాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించారు. రోడ్లు, ఇళ్లు, కార్యాలయాలు అన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో చాలా చోట్ల ప్రజలు నీళ్లలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తంబరం, ముడిచూర్, మనిపాకం, గుడువంచేరి, ఉరపాకం ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, పునరావాస ఏర్పాట్లకు, ఇతర సహాయక చర్యల కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ, వైమానిక దళ సిబ్బంది అంతా రంగంలోకి దిగి సహాయం చేస్తున్నారు. పడవల ద్వారా జలమయమైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేవీ మూడు బృందాలను చెన్నైకు పంపించింది. వీరితో పాటు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ బృందాలు ఇప్పటికే
వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చెన్నైకి రెండు సీ-17 విమానాలు
సహాయకచర్యల కోసం ప్రభుత్వం చెన్నైకి రెండు సీ-17 విమానాలను పంపిస్తోంది. ఒకటి భువనేశ్వర్ నుంచి మరోటి దిల్లీ నుంచి రానున్నాయి. రెండు విమానాలలో దాదాపు 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరుపతి చేరుకుంటాయి. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నై వెళ్తారు. జలదిగ్బంధంలో ఉన్న చెన్నైలో సహాయక చర్యల కోసం విశాఖ నుంచి చెన్నైకు ఐఎన్ఎస్ ఐరావత్ బయలుదేరినట్లు నేవీ పీఆర్వో సీజీ రాజు తెలిపారు. ఐఎన్ఎస్ ఐరావత్లో 5 జెమినీబోట్లు, 20 మంది గజ ఈతగాళ్లు, పెద్ద ఎత్తున సహాయ సామగ్రి, వైద్యుల బృందం ఉంటాయని తెలిపారు.
సహాయక చర్యలకు ఆటంకాలు
నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి పైకి నీరు వస్తున్నాయి. దీంతో పడవలను ఆశ్రయించాల్సి వస్తోంది. సహాయక సిబ్బంది పూర్తిగా పడవలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అత్యవసర సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారిపోయాయి. వందలాది ప్రజలు నిర్వాసితులయ్యారు. రవాణా, సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కాంచీపురంలోని 99 పునరావాస కేంద్రాల్లో 23వేల మందిని చేర్చారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమవడం, నీరు చేరడంతో జలమయమైన ప్రాంతాలకు ఆహారం, మంచినీరు సరఫరా చేయడానికి అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు నీట మునగని ప్రాంతాల్లో కొందరు ప్రజలు బాధితులను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నారు. ఆహారం, నీరు, మొబైల్ రీఛార్జిలకు సహాయం చేస్తున్నారు. నిర్వాసితులైన వారి కోసం కొన్ని చోట్ల షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు తెరిచి వారికి ఉండడానికి సహకరిస్తున్నారు. కార్యాలయాల్లో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉంటున్నారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలిస్తున్నారు.
రైల్వేలపై తీవ్ర ప్రభావం
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు రోడ్డు, రైల్వే వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. పలు చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోగా, రోడ్లపైనా అడుగులు మేర నీళ్లు నిలిచిపోయాయి. ఆ రోడ్లపై వాహనాలు నీట చిక్కుకున్న దృశ్యాలు సైతం దర్శనమిస్తున్నాయి. రవాణా వ్యవస్థ మొత్తం అస్థవ్యస్థమయ్యింది. రైలు పట్టాలపై నీళ్లు చేరడంతో చెన్నై ఎగ్మోర్ నుంచి వెళ్లాల్సిన 21 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తమిళనాడు మొత్తం విూద 31 రైళ్లు రద్దయ్యాయి. చెన్నై ఎగ్మోర్- కరైక్కుడి పాల్వన్, తిరుచ్చెందూర్, రామేశ్వరం, పుదుచ్చేరి, ట్యూటికోరిన్ , సెంగోట్టయ్ .. తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. అలాగే విల్లుపురం-తాంబారం మార్గంలో ప్రయాణించే 15 రైళ్లను దారి మళ్లించారు.
కుండపోత వర్షాలతో చెన్నై నగరం సతమవుతోంది. నగరమంతా జలమయం కావడంతో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉండడంతో నీటి మట్టం తగ్గడం లేదు. దీంతో మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలకూ తీవ్ర ఆటకం కలుగుతోంది. నీళ్లలో చిక్కుకుపోయిన వారికి వైద్య సదుపాయాలు, ఆహారం, ఇతర మౌలిక వసతులను కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడింది.
విమానాశ్రయం మూసివేత
అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అడయార్ నది ఉప్పొంగి ప్రవహించడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో ఆ
ప్రాంతమంతా నదిని తలపిస్తోంది. వరద ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. రన్‌వేపై నీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గురువారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చెన్నై ఎయిర్‌పోర్టుకు వెళ్లే పలు విమానాల రాకపోకలను రద్దు చేశారు. దీంతో దాదాపు 700మంది ప్రయాణికులు చెన్నై విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరికి నీరు, ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.





