Monday, 2 November 2026

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై:మద్దతివ్వాలని కరుణానిధితో భేటీచెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చెన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌ భేటీ అయ్యారు. యూపిఏ ప్రభుత్వం లో డీఎంకే స్థిరమైన భాగస్వామి అని అనంతరం మీడియా తో మాట్లడుతూ ప్రణబ్‌ అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, శివసేనల మద్దతు కూడా తనకుందని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అద్భుతాలకు తావు లేదని, ఇది మెజారిటీకి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *