Thursday, 5 November 2026

చెరువులో పడి విద్యార్థి మృతి

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సొండి చెరువులో పడి ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పాతపట్నం శివశంకర్‌ కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌ శనివారం సాయంత్రం కలువపూల కోసం చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతి చెందాడు. శ్రావణ్‌కుమార్‌ కోసం కుటుంబ సభ్యులు గాలించగా ఆదివారం ఉదయం సొండి చెరువులో బాలుడి మృతదేహం లభించింది. పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *