Tuesday, 3 November 2026

చేనేతకు చేయూత

C
– పేదరిక నిర్మూలనకు ‘నేత’ ప్రధానాస్త్రం కావాలి

– చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ

చెన్నై,ఆగస్ట్‌7(జనంసాక్షి): చేనేత వస్త్రాల ధారణ స్వాతంత్య్ర పోరా టంలో ప్రేరణగా నిలిచిందదని, అదే ఇప్పుడు పేదరిక నిర్మూలనకు స్ఫూర్తి కావాలని ప్రధాని మోడీ అబిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం తర్వాత పేదరిక నిర్మూలనకు చేనేత ఆయుధం కావాలన్నారు. చేనేత ఆయుధంగా స్వాతం త్య్ర సంగ్రామాన్ని సాగించామని గుర్తు చేశారు. తొలిసారిగా జాతీ య చేనే త దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. చెన్నైలోని మద్రాస్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని భారత చేనేత బ్రాండ్‌ లోగోను ఆవిష్కరించారు. అంతకు ముందు చేనేత వస్త్ర ప్రదర్శనశాలను మోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య సందర్శించారు. ఈ సందర్భంగా 75 మంది చేనేత కార్మికులకు సంత్‌ కబీర్‌ పురస్కారాలను ప్రధాని అందజేశారు. జాతీయ చేనేత దినో త్సవం సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… ప్రపంచ ప్రఖ్యాతి చెం దిన చేనేత వస్త్రాలు భారత్‌లో ఉత్పత్తి అవుతున్నాయన్నారు.  ఖాదీ వస్త్రాలు వినియోగించాలని గతేడాది ప్రజలను కోరాం… ఈ ఏడాది ఖాదీ వస్త్రాల విక్రయాలు 60శాతం పెరిగాయని ప్రధాని తెలిపారు. చేనేత ధరించడ మంటే అమ్మచేత కమ్మని వంట తిన్నంత హాయిగా ఉంటుందన్నారు. చేనేత వస్త్రాలు ఏ బ్రాండెడ్‌ బట్టలకు తీసిపోవన్నారు.   వివాహాది శుభకార్యాలు, పండుగలు, సాంస్కృతిక వేడుకల్లో చేనేతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. చేనేత ఉత్పత్తులకు యువత నుంచి ఆదరణ పెరగాలన్నారు.  చేనేత ఉత్ప త్తులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భం గా ప్రధాని హావిూ ఇచ్చారు.  ఈ- కామర్స్‌ ద్వారా చేనేత ఉత్పత్తుల విక్ర యం పెరగాల్సి ఉందన్నారు.  చేనేత క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు తీసుకుం టామన్నారు.  ఫ్యాషన్‌కు చిత్ర పరిశ్రమ పెట్టింది పేరు. సినీ రంగంలోనూ చేనేత, ఖాదీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చేనేతను అంశంగా తీసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వారి బతుకులు బాగుపడతాయని ప్రధా ని నరేంద్రమోదీ అన్నారు.  దేశంలోని నలుమూలల ఉన్నచేనేత రంగాన్ని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేతలో మనకున్న నైపుణ్యాన్ని ప్రో త్సహించాలన్నారు. చేనేత కార్మికుల బతుకులు బాగుపడేంత వరకు విశ్ర మించేది లేదని పేర్కొన్నారు. చేనేత చాలా కష్టంతో కూడుకున్న పని అని.. ఒక చీర నేసేందుకు ఒక్కోసారి నెల కూడా పడుతుందని పేర్కొన్నారు. చ ేనేత రంగం అభివృద్ధికి టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అందరం కలిసి చేనేత రంగానికి తిరిగి పూర్వవైభం తెచ్చేందుకు కృషి చేద్దామన్నారు. సినీ పరిశ్రమ వల్ల దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయని.. చేనేత రంగాన్ని అంశంగా తీసుకుని కొన్ని సినిమాలు వచ్చినా ఆ రంగానికి నేరుగా లబ్ధి చేకూరుతుందన్నారు. చేనేత రంగానికి వచ్చేసరికి ప్రపంచంలో పెద్దగా చోటులేదని తెలసి ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. చాలామందికి చేనేత రంగం ఒకటుందని తెలియదని, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో మన విఫలమవడమే ఇందుకు కారణమని మోదీ వివరించారు.  చేనేత కార్మికులకు సామాజిక భధ్ర కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఎన్నో ప్రధాన బ్రాండ్‌ బట్టలకన్నా చేనేత ఎంతో మెరుగైందని అన్నారు.  అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే పథకాలు ప్రారంభించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఉన్న సాయాన్ని 2కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్‌ రోశయ్య, రాష్ట్రమంత్రులు స్వాగతం పలికారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం చెన్నై చేరుకున్న ఆయనకు  ఘనస్వాగతం పలికారు.అనంతరం అక్కడి నుంచి వేడుకలు జరగనున్న మద్రాస్‌ యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు.

పోచంపల్లి గురించిప్రస్తావన

ప్రధాని నరేంద్ర మోడి ఇంకా ఉమ్మడి రాష్ట్ర ధ్యాసలో నుంచి బయటపడినట్లు లేదు. కొత్త రాష్ట్రం తెలంగాణను మోడీ మరిచిపోయినట్లున్నారు. చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభిస్తూ మోడీ అన్ని రాష్ట్రాల్లో ఉన్న చేనేత పరిశ్రమలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ తెలంగాణలోని పోచంపల్లిని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు చెప్పారు. పోచంపల్లి ఫ్రం ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. తమిళ అనువాదకురాలు కూడా యథాతథంగా ఆంధ్రలోని పోచంపల్లి అని చెప్పారు. పోచంపల్లి తెలంగాణలో ఉందన్న విషయాన్‌ఇన మరచిపోయారు.

జయతో ప్రత్యేకంగా సమావేశం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. శుక్రవారం మద్రాస్‌ యూనివర్శిటీలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మోదీ అనంతరం జయలలిత నివాసం పోయస్‌ గార్డెన్‌కు చేరుకుని ఆమెతో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటుభేటీ సాగింది. ఆమె ఈ కార్యక్రమానికి రాకపోవడంతో సిఎంను ప్రధాని కలిసి పరామర్శించారు. అనంతరం మోదీ దిల్లీ బయలుదేరి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *