చైనా చేరుకున్న ప్రధాని మోదీ
– చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో భేటి
– పలు కీలక అంశాలపై చర్చ
చైనామే14(జనంసాక్షి):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు.
మోదీ మూడు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. వీరిరువురు ద్వైపాక్షిక సంబంధాలు,
శాంతి పునరుద్ధరణ, వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై చర్చించారు. అలాగే జల సమస్యలతో పాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటుపైనా మోదీ ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఇక ఐరాసలో పరస్పరం సహకరించుకునేందుకు చర్చలు జరిపారు.అలాగే చైనా ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ
సమావేశం కానున్నారు. సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 20 రకాల వాణిజ్య అంశాలపై ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.అంతకు ముందు చైనా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బిజీబిజీగా గడుపుతన్నారు. మోదీకి జియాన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ప్రధాని పర్యటన చైనాలో మూడు రోజులపాటు కొనసాగనుంది. ప్రధాని మొదటగా అతి పురాతన నగరం అదేవిధంగా చైనా అధ్యక్షుడి జీ జిన్‌పింగ్ స్వస్థలమైన జియాన్ నగరాన్ని సందర్శించారు. అత్యంత పురాతన నగరం జియాన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని జియాన్‌లోని జింగ్‌షాన్ ఆలయాన్ని సందర్శించారు. అదేవిధంగా టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా ఆయన సందర్శించారు. చైనా సైనిక సత్తాకు టెర్రకోట సామ్రాజ్య నిదర్శనంగా ఉంటుంది. చైనీయుల చరిత్రలో యుద్ధవీరులకు పెట్టింది పేరు టెర్రకోట మ్యూజియం. జియాన్ చేరుకున్న ప్రధాని అక్కడ టెర్రకోట మ్యూజియంను సందర్శించారు. మ్యూజియంలో వేల సంఖ్యలో ఉన్న సైనిక శిల్పాలను చూసి మోదీ ఆశ్చర్యపోయారు. ప్రపంచ పర్యాటకులకు ఈ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జియాన్ నగరంలోనే మధ్యాహ్నం చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం అయ్యారు. జియాన్ ఎయిర్‌పోర్టులో మోదీకి చైనా అధికారులు ఘనస్వాగతం పలికారు. చైనా కళాకారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు చైనా, మంగోలియా, దక్షిణ కొరియాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. బీజింగ్‌లో చైనా ప్రధానితో సమావేశం కానున్న మోదీ సరిహద్దు సమస్య సహా పలు అంశాలపై చర్చించనున్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనలో వివిధ వాణిజ్య ఒప్పందాలతో పాటు, సరిహద్దు సమస్యలు, వీసా తదితర అంశాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 64 వేల కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అత్యంత పురాతన నగరం జియాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని జియాన్‌లోని జింగ్‌షాన్ ఆలయాన్ని, టెర్రకోట యుద్ధవీరుల మ్యూజియాన్ని కూడా సందర్శించారు. తాను మ్యూజియాన్ని సందర్శించిన సమాచారాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ. ద జింగ్షాన్ లోని ప్రముఖ బౌద్ధ దేవాలయం గోల్డెన్ టెంపుల్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బౌద్ధ బిక్షువుల ప్రార్థనల మధ్య బంగారు బుద్ధుని విగ్రహానికి ముకుళిత హస్తాలతో అంజలి ఘటించారు.మరోవైపు జియాన్ నగరంలోనే చైనా అధ్యక్షుడితో ప్రధాని సమావేశం కానున్నారు. చైనా ప్రధాని లికెక్వియాంగ్తో మోదీ సమావేశమై సరిహద్దు సమస్యలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 64 వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుంటే చైనా పర్యటనలో ఉన్న ప్రధాని కాబూల్ కాల్పులపై స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను ఖండించారు. అదేవిధంగా భారతీయ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. జరిగిన దుర్ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు అస్రఫ్‌ఘనితో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదంపై జరిపే పోరులో ఆఫ్గాన్‌కు సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.