జగన్‌ది ప్రజావంచన యాత్ర

అవినీతిలో జగన్‌ ముందంజ: మంత్రి

గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్నది ప్రజా సంకల్ప యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అవినీతిలో ప్రపంచంలో పేరు సంపాదించుకున్న జగన్పజ్రలకు ఎలాంటి సందేశం ఇస్తారని అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక నేరాలు జరిగినా అక్కడ జగన్‌ పేరే వినిపిస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో సైతం జగన్‌కు ఓటమి తప్పదని తెలిపారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ కనుమరుగవుతుందని అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ప్యారడైజ్‌ పేపర్స్‌లో జగన్‌ పేరుండటం అతని అవినీతికి పరాకాష్టగా మంత్రి అభివర్ణించారు. జగన్‌ పాదయాత్ర చేసినా, మోకాళ్ల యాత్ర చేసినా టీడీపీకివచ్చే నష్టమేవిూ లేదని మంత్రి అన్నారు. తనను గెలిపిస్తే రాజన్న పాలన తీసుకొస్తానని జగన్‌ చెబుతున్నారు. వేల ఎకరాల పేదల భూములను సెజ్‌ల పేరుతో లాక్కొని రైతులను నట్టేట ముంచడమేనా రాజన్న పాలన?, ప్రభుత్వ ఆస్తులను అనుచరులకు తెగనమ్ముకోవడమేనా రాజన్న పాలన? గోదావరి జిల్లాల్లో క్రాప్‌ హాలీడే ప్రకటించే దుర్భిక్ష పరిస్థితులు తీసుకురావడమేనా రాజన్న పాలన?’ అని మంత్రి నిలదీశారు.అసెంబ్లీలో ప్రజల సమస్యలను ఎలుగెత్తాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షం శాసనసభను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవటం బాధాకరమన్నారు. అసెంబ్లీని ఎదుర్కోలేక జగన్‌ రోడ్డెక్కాడని విమర్శించారు. ఆయన పాదయాత్రపై సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఆసక్తి చూపడం లేదన్నారు.

తాజావార్తలు