టిడిపికి భయం పట్టుకుందన్న తోపుదర్తి
అనంతపురం,అక్టోబర్30(జనంసాక్షి): ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి ఘటన తెదేపా కుట్రేనని వైకాపా రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. అయితే దీనిని జగనే చేయించుకున్నట్లుగా దుష్పచ్రారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. జగన్పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ చెప్పడం, ఫ్లెక్సీని విడుదల చేయడం వెనుక కుట్ర ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.ఈ ఘటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తెదేపా నేతలు వెంటనే తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హీరో శివాజీ పథకం ప్రకారమే అమెరికాకు పారిపోయాడని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించలేక పోతున్న నేతలు దాడికి గురైన వారిపైనే వెటకారంగా మాట్లాడటం సరికాదన్నారు. జగన్ మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నారని మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే వైఎస్సార్ సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనక సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎందుకు సీబీఐ విచారణ అంటే భయపడు తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగిన అర గంటకే పబ్లిసిటీ కోసమంటూ డీజీపీ చెప్పటం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గల్లంతవుతుందన్న భయంతోనే జగన్పై హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ను చంపేందుకు పక్కా ప్లాన్ జరిగిందని, అదృష్టవశాత్తూ అది విఫలమైందని పేర్కొన్నారు.




