Thursday, 5 November 2026

జగన్‌ బిసి వ్యతిరేకి: కాల్వ

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి కాల్వ శ్రీనివాస్‌ మండిపడ్డారు. బీసీలకు జగన్‌ శత్రువని, బీసీలపై జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని కాల్వ ఆరోపించారు. వైఎస్‌ రెండు బీసీ ఫెడరేషన్‌లు వేసి రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. అత్యంత కీలకమైన శాఖలను బీసీలకు అప్పగించిన ఘనత టీడీపీదేనన్నారు. గురివింద సామెతలాగా జగన్‌ మాటలు ఉన్నాయని కాల్వ శ్రీనివాస్‌వ్యాఖ్యానించారు.