బిజెపికి వ్యతిరేకంగా టిడిపి ఆందోళన

విజయవాడలో స్వల్ప ఉద్రిక్తత

విజయవాడ,జూన్‌11(జ‌నం సాక్షి): ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ధర్నాకు కౌంటర్‌గా టిడిపి నేతలు కూడా నిరసన తెలిపారు. టిడిపి పాలనలో రాష్ట్రంలో అవినీతి పేరుకుపోతోందని బిజెపి ధర్నా చేపట్టింది. దీంతో టిడిపి బిజెపి ఎపికిచ్చిన హావిూలను అమలు చేయాలని నిరసిస్తూ బిజెపి ధర్నాకు కౌంటర్‌గా నిరసన చేపట్టింది. ఇరు పార్టీల నేతలు పోటీపోటీగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మరింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.