నెల్లూరు,మే24(జనం సాక్షి): వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో సోదరులకు ఏడాదికి 10వేల రూపాయలు భృతి ఇస్తానని ప్రకటించిన వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నెల్లూరు నగరంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ తీసారు. రాజన్న భవన్ నుంచి మినీబైపాస్, రామలింగా పురం,మద్రాస్ బస్టాండ్,గాంధీ బొమ్మ సెంటర్, ట్రంక్ రోడ్డు,నర్తకి సెంటర్,ఆత్మకూరు బస్టాండ్,విజయమహల్ గేటు వరకు ఆటో సోదరులు నిర్వహించిన ర్యాలీని నిర్వహించారు. ఇందులో ఆటోవాలాలంతా పాల్గొని ఉత్సాహం ప్రదర్శించారు. నెల్లూరు నగర శాసనసభ్యులు డా పి.అనీల్ కుమార్ యాదవ్ ఆటో నడిపి ప్రారంభించారు. వారికి ఉత్సాహం నింపారు. వైకాపా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు.




