Thursday, 5 November 2026

జగన్‌ హావిూలకు కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదు: కెఇ

కర్నూలు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జగన్‌ ఇచ్చే హావిూలు అమలు చేయాలంటే కేంద్ర బడ్జెట్‌ కూడా సరిపోదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఎడాపెడా వాగ్దానాలు చేస్తూ,హావిూలు గుప్పిస్తున్నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన విూడియాతో మాట్లాడుతూ కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాజన్నరాజ్యం అంటే అధికారులను జైలుకు పంపడమా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే బ్రోకర్స్‌ ఆఫ్‌ జగన్‌ అండ్‌ పవన్‌ అని కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ ఇద్దరి వల్లా ఒరిగేదేవిూ లేదన్నారు. జగన్‌ కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. అడ్డంగా దోచుకోవడం జగన్‌ నైజమని, ప్రజలు ఆయనను నమ్మరని కెఇ అన్నారు.