ముందు విూ అన్నను నిలదీయండి

పవన్‌ కళ్యాణ్‌కు జివి సూచన

గుంటూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మంత్రి లోకేష్‌ను పవన్‌ కళ్యాణ్‌ విమర్శించడంపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌ను విమర్శించే నైతిక అర్హత పవన్‌కు లేదన్నారు. పవన్‌ ఏం ప్రజాసేవ చేశాడని సీఎం కావాలని ఆశపడుతున్నారని ఆంజనేయులు ప్రశ్నించారు. ‘అందరినీ ప్రశ్నించే పవన్‌ విూ అన్న చిరంజీవిని ఎందుకు ప్రశ్నించర’ని నిలదీశారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకే కేటీఆర్‌ను పవన్‌ పొగుతున్నారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే జనలేనకూ పడుతుందని ఆంజనేయులు వ్యాఖ్యానించారు. కేవలం తమను విమర్శించడం కాదని, ఎపికి అన్యాయం చేసిన మోడీని విమర్శించాలన్నారు.

 

తాజావార్తలు