Wednesday, 4 November 2026

జడ్చర్ల శోకసంద్రం

మహబూబ్‌నగర్ : వీరమరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్యను కడసారి చూసేందుకు జనం భారీగా తరలివచ్చింది. ఆశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. జడ్చర్ల పట్టణమంతా శోకసంద్రమైంది. సిద్ధయ్య మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం లాంఛనాలతో సిద్ధయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *