జన్మభూమి కమిటీల పేరుతో బాబు దోపిడి

– జగన్‌ సీఎం అయితేనే రైతురాజ్యం సాధ్యం
– టీడీపీ దోపిడీ రాజకీయాలు, అసమర్థ పాలనను ప్రజలకు తెలియజేయండి
– వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
ఒంగోలు,జూన్‌5(జనం సాక్షి): ఏపీలో జన్మభూమి కమిటీల పేరుతో బాబు దోపిడీకి పాల్పడుతున్నాడని  వైసీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి అన్నారు. మంగళవారం జిల్లాలోని పర్చూరులో నియోజక వర్గాల బూత్‌ కన్వినర్లకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ముఖ్యమంత్రే వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహంకార పూరిమైన పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం వస్తుందని తెలిపారు. ఏ రాజకీయ పార్టీకైనా కళ్లు, ముక్కు, చెవులు అన్నీ బూత్‌ కమిటీలే అని చెప్పారు. కర్రలు విసిరినా, కత్తులు తిప్పినా బూత్‌ స్థాయిలో కన్వినర్లకే సాధ్యమన్నారు. కొత్త ఓట్లు చేర్చడంలో యాక్టివ్‌గా ఉండాలన్నారు. టీడీపీ దోపిడీ రాజకీయాలు, అసమర్ధ పాలనను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దా విషయంలో బీజేపీ, తెదేపాలు కలిసి ఆడుతున్న నాటకాలను ప్రజలకు వివరింగా అవగాహన కల్పించాలని తద్వారా వచ్చే ఎన్నికల్లో తెదేపాకు గుణపాఠం చెప్పవచ్చని తెలిపారు. చంద్రబాబు అసమర్థత వల్లే నేడు ప్రత్యేక ¬దా సాధ్యం కాలేదని, ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతుందన్నారు. కానీ అవినీతిలో మాత్రం దేశానికే ఆదర్శంగ ఆనిలుస్తుందని, ఇది చంద్రబాబు పాలన అని అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, సరియైన సమయంలో బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడు మోపిదేది వెంకట రమణ, అద్దంకి, పర్చూరు, చీరాల నియోజక వర్గ ఇంచార్జులు గరటయ్య, రావి రామనాధం బాబు, ఎడం బాలాజీలు పాల్గొన్నారు.