Tuesday, 3 November 2026

తణుకులో కొనసాగుతున్న జగన్‌ పాదయాత్ర

ఏలూరు,జూన్‌ 5(జనం సాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు విూదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసమస్యలు తెలుసుకంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు జననేత2,248.2 కిలో విూటర్ల దూరం నడిచారు.