అందరికీ ఉద్యోగాల కల్పనకు కృషి: మంత్రి ఆదినారాయణ
కడప,ఆగస్ట్14(జనం సాక్షి): కడప జిల్లా జమ్మలమడుగు స్థానిక డిగ్రీ కళాశాలలో ఎటిఐడిఎ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థులు అందరూ ఉద్యోగాలు పొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో మార్పులు రావాలని, అభివృద్ధికి పునాదులు విద్యార్థులేనని అన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు, ఎటిఐడిఎ అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.




