Tuesday, 3 November 2026

జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన

7న్యూఢిల్లీ,జనవరి9(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమల్లోకి రానుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఒమర్‌ అబ్దుల్లా అయిష్టత వ్యక్తంచేయడంతో గవర్నర్‌ పాలనకు కేంద్రం సిఫార్సు చేసింది. ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఏ పార్టీకీ పూర్తి స్థాయి ఆధిక్యం రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం కారణంగా, ఒమర్‌ తప్పుకోవాలన్న నిర్ణయంతో జమ్మూకశ్మీర్‌ లో గవర్నర్‌ పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. అతిపెద్ద పార్టీలుగా అవరించిన పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు సాగించినా ఒక అవగాహనకు రాలేకపోయాయి. మరోవైపు  ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్‌ అబ్దుల్లా స్పష్టం చేయడంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. ఫలితంగా గవర్నర్‌ పాలనకు కేంద్రం సిఫారసు చేసింది. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు మార్గం సుగమమైంది. జమ్మూకశ్మీర్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ పాలనను ఆమోదిస్తూ కేంద్రం  సిఫారసులు చేసింది. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ సరైన నిర్ణయం తీసుకోకపోవటంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా గవర్నర్‌ పాలన అంశంపై కేంద్రానికి ఓ నివేదికను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలనను అమలుచేయనున్నట్టు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *