http://JanamSakshi.org/imgs/2015/01/46.jpg2017 నాటికి టీఎస్‌పిఎస్సీ పూర్తి సెలబస్ – ప్రొ. హరగోపాల్
హైదరాబాద్,జనవరి9(జనంసాక్షి): ప్రస్తుత గ్రూప్స్ పరీక్షల పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు నిపుణుల కమిటీ చైర్మన్ ప్రొ. హరగోపాల్ తెలిపారు. తాము పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సూచనలు మాత్రమే ఇస్తామని, తుది నిర్ణయం కమిషన్‌దేనన్నారు. 2017 నాటికి టీఎస్‌పీఎస్సీ పరీక్షల సిలబస్‌లో పూర్తి మార్పులు చేస్తామన్నారు. ఏపీ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, భౌగోళిక పరిస్థితులు, చరిత్ర స్థానాల్లో తెలంగాణ అంశాలు చేరుస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో కమిషన్‌కు సూచనల నివేదిక అందిస్తామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాఠ్యాంశాల నిపుణుల కమిటీ సమావేశం చైర్మన్ చక్రపాణి సమక్షంలో జరుగుతోంది. ఆచార్య హరగోపాల్ అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కమిటీ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరయ్యారు. పాఠ్యాంశాల ఎంపిక, గ్రూప్స్ పరీక్షల్లో విధివిధానాలపై సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గ్రూప్స్ పరీక్షల పాఠ్యాంశాల్లో స్వల్ప మార్పులు ఉంటాయని హరగోపాల్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సూచనలు మాత్రమే ఇస్తున్నామని పేర్కొన్నారు. సిలబస్‌పై తుది నిర్ణయం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌దేనని చెప్పారు. ఏపీ చరిత్ర, ఆర్థికశాస్త్రం, భౌగోళిక పరిస్థితుల స్థానంలో తెలంగాణ చరిత్ర, ఆర్థిక శాస్త్రం, తెలంగాణ బౌగోళిక పరిస్థితుల అంశాలు ఉంటాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కమిషన్‌కు సూచనల నివేదిక ఇస్తామని చెప్పారు.
సెలబస్‌లో స్వల్ప మార్పులు




