Monday, 2 November 2026

జమ్ముకశ్మీర్ లో మహిళా బెటాలియన్స్

కశ్మీర్ లోయలో పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఆందోళన సృష్టిస్తున్న వారిని కట్టడి చేసేందుకు పోలీస్ బెటాలియన్ లోకి 1000 మంది మహిళా పోలీసులను నియమించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం శాంక్షన్ చేసిన ఐదు ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్స్ తో వీరు భాగస్వాములవుతారు.   ఈ ఐదు ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్స్ లో 5వేల పోస్టులకుగాను జమ్మూ కశ్మీర్ కు చెందిన 1,40,000 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40 శాతం అప్లికేషన్లు కశ్మీర్ లోయ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. . కశ్మీర్ లో రాళ్లు రువ్వే వారిని అదుపు చేయడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడంలో వీరు కీలకపాత్ర పోషిస్తారని హోంశాఖ కార్యాలయం తెలిపింది. ఒక్కో ఉద్యోగానికి 30మంది  పోటీ పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ఇండియన్ రిజర్వుడ్ బెటాలియన్స్ ఏర్పాటు చేశామని… 60శాతం వేకన్సీలను జమ్మూ కశ్మీర్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాల నుంచి భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *