– బద్వేల్‌లో వంద ఎకరాల్లో టవర్ల నిర్మాణం
– జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం
హైదరాబాద్,ఫిబ్రవరి 8(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హావిూలను నెరవేర్చేదిశగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు. జర్నలిస్టుల అభీష్టం మేరకు బుద్వేల్‌లో ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతమని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అక్కడ టవర్స్ నిర్మించి అందచేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టులు కలిశారు. సీఎం సూచన మేరకు నగరంలోని ప్రభుత్వం స్థలాలను జర్నలిస్టుల పరిశీలించారు. బుద్వేల్ ప్రాంతంలోని స్థలం ఇండ్ల నిర్మాణానికి, రవాణా సదుపాయానికి అనువుగా ఉందని జర్నలిస్టులు సీఎం కు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం జర్నలిస్టుల అభీష్టం మేరకు బుద్వేల్‌లో ఇండ్ల నిర్మాణం చేపడుతమని హావిూనిచ్చారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ పరిధిలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో జర్నలిస్టుల కోసం నివాస గృహాలు నిర్మించనున్నట్టు సీఎం తెలిపారు. నగరంలో పనిచేసే అన్ని రకాల జర్నలిస్టులకు గృహాలు సమకూరేలా బహుళ అంతస్తుల టవర్స్ నిర్మిస్తమని ప్రకటించారు. బుద్వేల్‌లోని స్థలం గ్రావిూణాభివృద్ధి శాఖ అధీనంలో ఉందని.. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఎస్‌పీ సింగ్, రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ అనితారామచంద్రన్‌ను ఆదేశించారు. జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని సమన్వయం చేయాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావుకు సీఎం సూచించారు. హైదరాబాద్, వరంగల్‌లో జర్నలిస్టుల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను నగరంలో రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో తొలుత 100 ఎకరాల్లో జర్నలిస్టులకు అపార్ట్‌మెంట్స్ నిర్మించనున్నారు. బుద్వేల్‌లో గ్రావిూణాభివృద్ధిశాఖ పరిధిలోని భూమిని రెవెన్యూశాఖకు బదిలీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పార్ట్‌టైమ్ విలేకరులకు డబుల్ బెడ్‌రూమ్ పథకంలో ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.





