జర్నలిస్టుల హౌజింగ్‌ విధానాలు ప్రకటించాలి: ఎపియుడబ్ల్యుజె

ఏలూరు,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): ఎపియుడబ్ల్యుజె 61వ ఫార్మేషన్‌ డే సందర్భంగా శుక్రవారం పాలకొల్లులోని ఎపియుడబ్ల్యుజె నాయకులు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపియుడబ్ల్యుజె నేతృత్వంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాత్రికేయుల గృహ నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన విధానం ప్రకటించాలని ఎపియుడబ్ల్యుజె సభ్యులు కోరారు. కార్యక్రమానికి ముందుగా మాజీ ప్రధాని వాజపేయికి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుతం వాజ్‌పేయి మరణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెలవు ప్రకటించినప్పటికీ పాలకొల్లులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగానే కొనసాగుతున్నాయి.

తాజావార్తలు