Tuesday, 3 November 2026

జలసిరిపై పాట రాయడం నా అదృష్టం: అనంతశ్రీరామ్‌

కడప,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్టాభ్రివృద్ధిలో తనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని సినీ గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల పర్యటనకు గన్నవరం నుంచి కడప విమానాశ్రానికి సీఎం ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనతో పాటు అనంత్‌ శ్రీరామ్‌, వందేమాతరం శ్రీనివాస్‌ ఉన్నారు. ఈ సందర్భంగా అనంత్‌శ్రీరామ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అదేశాల మేరకు జలసిరిపై పాటలు రాస్తున్నానని, ఇప్పటికే ఒకపాట పూర్తి చేశానని శ్రీరామ్‌ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పాటలు రాసే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పలువురి కోరిక మేరకు జలసిరిపై రాసిన పాటను అలపించారు.