Tuesday, 3 November 2026

జస్టిస్‌ కృష్ణయార్‌ ఇకలేరు

5

ప్రధాని, రాష్ట్రపతి సంతాపం

చెన్నై, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణయ్యర్‌ గురువారం కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. గత నవంబరు 15న ఆయన వందో పుట్టినరోజు జరుపుకొన్నారు. కోచిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జ్టసిస్‌ కృష్ణయ్యర్‌ కేరళలోని పాలక్కాడ్‌ వద్ద వైద్యనాథపురంలో జన్మించారు. 1952లో కేరళ శాసనసభకు ఎన్నికైన ఆయన 1957లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 1999లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ‘వాండరింగ్‌ ఇన్‌ మెనీ వరల్డ్స్‌’ పేరుతో ఆయన జీవిత చరిత్ర వెలువరించారు. మొత్తం 105 పుస్తకాలు ప్రచురించిన జ్టసిస్‌ కృష్ణయ్యర్‌ చట్టాలు, న్యాయానికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా రాశారు. 4 యాత్రాపుస్తకాలు రాశారు. ఆయన చాలా నిజాయితీగా పనిచేశారు. అందుకే దేశంలో ఏ కుంభకోణం జరిగినా కృష్ణయార్‌తో విచారణ చేయించాలని వామపక్షాలు డిమాండ్‌ చేసేవి. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుజస్టిస్‌ కృష్ణయ్యర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *