తడ (నెల్లూరు) : ఇండియన్ సిలంబం ఫెడరేషన్ తొమ్మిదో జాతీయ ఛాంపియన్‌షిన్ కర్రసాము పోటీల్లో మండలంలోని కోటంబేడు యువత ప్రతిభను చాటారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు తమిళనాడులోని అవడిలో జరిగిన కర్రసాము పోటీల్లో వోటంబేడు పంచాయతీ వోటంబేడు కుప్పానికి చెందిన ఎస్. దైవానీ (9వ తరగతి) ద్వితీయ, ఎస్ జ్యోతి (8వ తరగతి) ద్వితీయ , ఎస్ వాణి (8వ తరగతి) తృతీయ, కె. మౌనిక (9వ తరగతి) ద్వితీయ, బి. సుబ్బలక్ష్మి (ఇంటర్ మొదటి సంవత్సరం) ద్వితీయ, టి. ముత్తు తృతీయ, టి. వినీత్ తృతీయ, జి. ద్వితీయ, కె. వెంకటేష్ (తడకుప్పం) తృతీయ బహుమతులు సాధించారు.




