Tuesday, 3 November 2026

జార్ఖండ్‌లో మావోయిస్టుల పంజా

ఎస్పీ సహా ఆరుగురి కాల్చివేత
రాంచీ, జూలై 2 (జనంసాక్షి) :
జార్ఖండ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. పకూర్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన ఆపరేషన్‌లో ఎస్పీ సహా ఆరుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. మంగళవారం పకూర్‌ ఎస్పీ అమర్‌జిత్‌ బలిహార్‌ దుంకా నుంచి తిరిగి వస్తుండగా మాటు వేసి ఉన్న మావోయిస్టులు ఆయన క్యాన్వాయ్‌పై మూకుమ్మడిగా కాల్పులు జరిపారు. ఘటనలో ఎస్పీ బలిహార్‌తో సహా మరో ఆరుగురు పోలీసులు మృతి చెందినట్లు జార్ఖాండ్‌ డీజీపీ తెలిపారు. మరో ముగ్గురికి గాయాలయినట్లు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన బలిహార్‌ నక్సల్స్‌ కాల్పుల్లో మరణించిన రెండో ఎస్పీ. రాంచీకి 400 కిలోమీటర్ల దూరంలో నక్సల్స్‌ ఈ దాడికి పూనుకున్నారు. ఈ ఘటన అనంతరం 200 మంది సాయుధ బలగాలు సంఘటన స్థలానికి తరలివెళ్లాయి. మావోయిస్టుల కోసం అమ్రాపద, దుంకా ప్రాంతాల్లో భారీ కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *