జింకల వేట కేసులో సల్మాన్‌కు చుక్కెదురు
జైపూర్,మే14(జనంసాక్షి):
కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సాక్షులను మళ్లీ విచారించాలని సల్మాన్ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కృష్ణజింకను వేటాడిన ఘటనకు సంబంధించి సల్మాన్‌పై అక్కడి అటవీ అధికారులు ఆయుధాల చట్టంకింద లైసెన్సు లేని ఆయుధాలు ఉపయోగించినట్లు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఉంది. ఇప్పటికే పలుమార్లు సల్మాన్ విచారణకు హాజరయ్యారు.