దేవాలయాలపై రాజకీయ జోక్యం తగదు: రామకృష్ణ
విజయవాడ,మే24(జనం సాక్షి): దేవాలయాలపై రాజకీయ జోక్యం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు. తిరుమల ఆలయంపై బీజేపీ తీరు సరైంది కాదన్నారు. కావాలనే ఈ విషయంలో బిజెపి సమస్యను రాజేయాలని చూస్తోందన్నారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ అన్ని సంస్థలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీటీడీపై కేంద్ర వైఖరిని ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. టిటిడిపై పెత్తనాన్ని సహించబోమని అన్నారు.