హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధుల జీతాల పెంపు బిల్లును మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై పలువురు సభ్యులు సూచనలు చేశారు. మాజీ ప్రతినిధులకు పెన్షన్లు పెంచాలని సభ్యుల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే.. సూచనలన్నింటిని వచ్చే సమావేశాల్లో చర్చించి అమలు చేద్దామని కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ బిల్లును యథాతథంగా సభ ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా గతంలో కంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మూడు రెట్లు అదనంగా వేతనాలు పెరగనున్నాయి.
సమర్థిస్తున్నాం..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపును పూర్తిగా సమర్ధిస్తున్నామని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ అన్నారు. దీనివల్ల సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులకు పెన్షన్ 30 వేల నుంచి 50 వేలకు పెచాలని సంపత్ కుమార్ కోరారు.
హౌస్ అలవెన్స్ పెంచాలి..
ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతం సరిపోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యేలకు ఇచ్చే హౌస్ అలవెన్స్ పెంచాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా కారు లోన్‌ను కూడా పెంచాలని చింతల తెలిపారు.
వచ్చే సమావేశాల్లో..
మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్ పెంపు అంశాన్ని వచ్చే సమావేశాల్లో పరిశీలిద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. సభలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యుల సూచనలపై సీఎం జవాబిచ్చారు. ఏవైనా సవరణలు ఉంటే వచ్చే సమావేశాల్లో చేసుకుందామని తెలిపారు కేసీఆర్.
జీతాలు పెంపు బిల్లు ఆమోదం..





