జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు రెండొందల రోజులు అవసరమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఐఏఎస్ ల కేటాయింపు ఇటీవలే పూర్తైందన్న ప్రభుత్వం.. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన జరగుతుందని తెలిపింది. దీనికోసం జీవో నెంబర్ 60 జారీ చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రభుత్వ వాదనను విన్న కోర్టు అన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ




