హైదరాబాద్ : జీహెచ్ఎంసీ రికార్డుస్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను రూ.1,111 కోట్లు వసూలు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడాది రూ.2,600 కోట్లు ఉన్న ఆదాయం రూ.3,300 కోట్లకు పెరిగిందని సోమేశ్ కుమార్ తెలిపారు. అందరి సహకారంతో ఈ పని చేయడం జరిగిందని, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. నాలుగైదు సంవత్సరాల నుండి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పరిష్కరించామని, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందన్నారు. ట్యాక్స్ సరిగ్గా కట్టాలని, ఈ విషయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సహకరించిందని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు.జీహెచ్ఎంసీ రికార్డు స్థాయి ఆస్తి పన్ను వసూలు..
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ రికార్డుస్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను రూ.1,111 కోట్లు వసూలు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. గత ఏడాది రూ.2,600 కోట్లు ఉన్న ఆదాయం రూ.3,300 కోట్లకు పెరిగిందని సోమేశ్ కుమార్ తెలిపారు. అందరి సహకారంతో ఈ పని చేయడం జరిగిందని, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు. నాలుగైదు సంవత్సరాల నుండి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలను కూడా పరిష్కరించామని, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందన్నారు. ట్యాక్స్ సరిగ్గా కట్టాలని, ఈ విషయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సహకరించిందని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు.



