28న రఘువర్‌దాస్ ప్రమాణం
హాజరు కానున్న మోదీ
రాంచి,డిసెంబర్26(): ఝార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రఘుబర్‌దాస్ 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతారని రఘుబర్‌దాస్ తెలిపారు.జార్కండ్ కొత్త ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం సమావేశంలో ఈ మేరకు రఘువర్ దాస్ ను ఎన్నుకున్నారు. జార్కండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేస్తారు. ముగ్గురు నేతలు పోటీపడగా రేసులో దాస్ ముందుకు వచ్చారు. జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన శాసనభకు ఎన్నికయ్యారు. జార్కండ్ కు తొలి గిరిజనేతర ముఖ్యమంత్రిగా దాస్ నిలిచిపోతారు. .బిజెపి సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలవడంతో ఈయనకు అవకాశం దక్కింది. ఏభైనాలుగేళ్ల దాస్ డిగ్రీ చదవుకున్నారు. ఈయనపై రెండు చిన్న క్రిమినల్ కేసులో గతంలో నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే ఆయన గతంలో డిప్యూటీ సిఎంగా సమర్థంగా పనిచేశారు. ఇదిలావుంటే ఝార్ఖండ్‌లో గిరిజనేతరుడిని ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఝార్ఖండ్ పీపుల్స్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీనియర్ భాజపా నేత, గిరిజనేతరుడు అయిన రఘుబర్‌దాస్‌ను ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చేయడం పట్ల నిరసన వ్యక్తంచేస్తూ ఆయన ప్రమాణస్వీకారం రోజున రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేపీపీ అధ్యక్షుడు సూర్యసింగ్ బేస్రా శుక్రవారం ప్రకటించారు. రఘుబర్‌దాస్ ప్రమాణస్వీకారం డిసెంబరు 28న ఉండొచ్చని భావిస్తున్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ఝార్ఖండ్ రాష్టరానికి గిరిజనేతరుడిని ముఖ్యమంత్రిని చేయడం ఆమోదనీయం కాదని ఆయన పేర్కొన్నారు





