Monday, 2 November 2026

ట్రాఫిక్‌ జాం రహిత నగరంగా హైదరాబాద్‌

4

విశ్వ నగరంగా మన సిటీ

రౌడీ మూకలు, భూ ఆక్రమణదారులు నాశనం చేశారు

డ్రైవర్‌ కమ్‌ ఓనర్స్‌ కార్ల పంపిణీలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌26 : భాగ్యనగరాన్ని రౌడీలు, కబ్జాకోరులు నాశనం చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. పేరుకు మహానగరం అయినప్పటికీ ఓ పద్ధతి ప్రకారం లేదని, హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇందుకోసం తానే ముందుండి నడుం బిగించానన్నారు. శుక్రవారం నెక్లెస్‌ రోడ్డులో డ్రైవర్స్‌ కమ్‌  ఓనర్స్‌ పథకం కింద 303 మందికి సీఎం కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ  రాష్ట్రంలో నెలకొల్పబోయే స్కిల్‌ డవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కోసం స్థలం కేటాయిస్తామని  తెలిపారు. 2018లో ఐటీ సదస్సును ఘనంగా నిర్వహిస్తామన్నారు. 2018లో ప్రపంచ ఐటీ సదస్సు ఇక్కడ జరగబోతోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌ నగరాన్ని శాస్త్రీయ పద్ధతిలో తయారు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 2018లో జరగబోయే ప్రపంచ ఐటీ సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. ఇది శుభ సూచకమన్నారు. ఇలాంటి ఎన్నో సదస్సులకు హైదరాబాద్‌ వేదిక కావాలన్నారు. హైదరాబాద్‌ పేరుకే మహానగరమైనా.. అనుకున్న సౌకర్యాలు లేవు అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను చూసి అబ్బురపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని గత పాలకులు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను ఊహించినంతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మహానగరాన్ని ట్రూత్‌ ఫుల్‌ గ్లోబల్‌ సిటీగా తిర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపోందిస్తున్నట్లు ప్రకటించారు.  గత పాలకులు హైదరాబాద్‌ను అభివృద్ధి పరంగా తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని, భూ మాఫియా,కబ్జాదారాలతో నింపారని అంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరాన్ని నిజమైన విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఇక్కడి భూ పుత్రులతో ఉన్నత స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. హైదరాబాద్‌ నగరాన్ని ఎవరు ఊహించని రీతిలో, అందరు అబ్బురపడేలా అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో  నిరుద్యోగులకు వివిధ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం శిక్షణ ఇవ్వడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ స్థాపనకు ఎంతైన భూమి కేంద్రానకి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలిజికి చెందిన ప్రపంచ ఐటి సదస్సు 2018సంవత్సరంలో హైదరాబాద్‌ నగరంలో  జరపాలని నిర్ణయించడం హైదరాబాద్‌ నగరానికి గర్వకారణమని అన్నారు. దేశంలోని అనేక నగరాలను తోసిపుచ్చి ఐటి సదస్సును హైదరాబాద్‌ నగరంలో నిర్వహించాలని నిర్ణయించడం హైదరాబాద్‌ మహానగర గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. నగరంలోని డ్రైవర్లకు డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పధకంలో భాగంగా మరో 600 మందికి కూడా కార్లను అందజేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు 406 మందిని కారు యజమానులుగా చేసినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంకా డిమాండ్‌ పెరుగుతందని అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ఉపాధి,ఉద్యోగ రంగాల్లో యువతకు అవకాశాలను కల్పించడానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు  చేయడానికి అవసరమైన భూమిని కేటియించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కోరారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పటుకు తగు నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని ఆయన ప్రకటించారు. నైపుణ్యాల అభివృద్ధితో లక్ష మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ స్వాగతం పలుకుతూ దాదాపు 21కోట్ల రూపాయలను ఈ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ పధకానికి అయ్యిందని దీనిలో మూడు కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడిగా అందించిందని తెలియజేశారు. నేడు అందిస్తున్న 303 కార్లలో105కార్లను జిహెచ్‌ఎంసినే అద్దె ప్రాతిపధికపై తీసుకుంటుందని మిగిలిన కార్లను నగరంలోని ప్రైవేట్‌ క్యాబ్‌ సర్వీస్‌లు ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ డ్రైవర్లకు 50 వేల రూపాయల ఆరోగ్య భీమా పధకాన్ని వర్తింపజేయడానికి మారుతి సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 303మందిఇ డ్రైవర్లకు తాళాలు అందించి కార్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహ్మద్‌ అలీ, డాక్టర్‌ రాజయ్య, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,ఎంపి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *