Tuesday, 3 November 2026

టి`కాగ్‌ ఎంపీల జంప్‌కు రంగం సిధ్దం

హైదరాబాద్‌, జనంసాక్షి: టి కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణపై ఇచ్చిన డెడ్‌లైన్‌ నేటితో ముగియడంతో కేసిఆర్‌తో నేడు ఎంపీ వివేక్‌ ఇంట్లో గంటన్నర పాటు సమావేశమై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ తెలంగాణకు ఇచ్చిన మాటను నెరవేర్చక పోగా తాము ఇచ్చిన డెడ్‌లైను కూడా లెక్క చేయకుండా విస్మరించడంతో రాబోవు కాలంలో ఇకపై తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా ఉండలేమని వారు తేల్చి చేప్పారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌లో జూన్‌ 2వ తేదీన నిజాం గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సమావేశానంతరం విలేఖరులతో మాట్లాడుతు ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని  స్వాగతిస్తామని కేసిఆర్‌ ప్రకటించారు. టి కాగ్‌ ఎంపీల నిర్ణయాల పట్ల పలువురు తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *