టిడిపి పీఠం కదల్చడానకే జగన్‌ పాదయాత్ర: రోజా

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఆగదని వైకాపా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా అన్నారు. జగన్‌ పాదయాత్రకు ఇబ్బందులుపెడితే ప్రభుత్వ పతనం తప్పదని ఆమె హెచ్చరించారు. జగన్‌ పాదయాత్రను పురస్కరించుకుని సోమవారం ఇడుపులపాయకు చేరుకున్న రోజా ఇక్కడి సభా ప్రాంగణంలో ఆమె మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తానంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో, మంత్రులకు దిమ్మతిరిగిందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ప్రభుత్వానికి యువత రాజన్న రక్తం వస్తోందని తొడగొట్టి చెప్పాలని పేర్కొన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వాన్ని గ్దదె దింపేదుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్‌ఆర్‌ కుటుంబం మాట తప్పదు.. మడమ తిప్పదు.. అంటూ ఈ విషయం పలు అంశాల్లో రుజువైందని గుర్తు చేశారు. పాదయాత్ర వృథా అని అంటున్న వారికి రాష్ట్రంలో సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు గ్రామాల్లో తలెత్తుకు తిరిగారని అన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తేనే మళ్లీ రైతు రాజ్యం ఏర్పడుతుందని అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. జగన్‌ తన పాదయాత్రద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుంటారని అన్నారు.

తాజావార్తలు