టిడిపి మాత్రమే అభివృద్దికి కట్టుబడి ఉంది: రమణ

తిరుపతి,జూలై17(జ‌నం సాక్షి): ఎలాంటి షరతులు లేకుండా త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు టిటిడి మాజీ సభ్యుడు ఓవీ రమణ ప్రకటించారు. ఈసారి ఎన్నికలు అభివృద్ధికి, అహంకా రానికి మధ్య జరుగుతాయని అన్నారు. తెలుగుదేశం మాత్రమే అభివృద్దికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. అందుకే తాను పార్టీలో చేరి ప్రజాసేవకు పూనుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశిస్తున్నప్పటికీ, చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమన్నారు. ఇదిలావుంటే మహాసంప్రోక్షణ పేరిట ఆరు రోజులపాటు తిరుమలకు భక్తులు రావద్దని చెప్పడానికి టీటీడీ పాలకమండలికి ఏమి అధికారం ఉందని ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. గతంలో మహాసంప్రోక్షణ జరుగుతున్న రోజుల్లోనూ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే టీటీడీ పాలకమండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. గతంలో కరుణాకరరెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నప్పటికీ చాలాసార్లు విభేదించానని గుర్తుచేశారు.

 

తాజావార్తలు