హైదరాబాద్ : టిఆర్ ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పుస్తకం విడుదల చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చే 18 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ…కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రచారంకోసమే డబుల్ బెడ్రూం ఇళ్లంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు.. 18 నెలల పాలనలో గులాబీ సర్కారు పాలన, 50 ప్రశ్నలతోకూడిన బుక్లెట్ను ఉత్తమ్ విడుదల చేశారు.. ఈ పుస్తకాన్ని వరంగల్లో ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మయం :ఉత్తమ్





