టీడీపీ నేత కుమార్తె దారుణ హత్య
ఏపీ : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. రామచంద్రాపురం టీడీపీ అధ్యక్షుడు నందులరాజు కుమార్తె దీపికను దుండగులు దారుణంగా హత్య చేశారు. దీపిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు కత్తితో పొడిచినట్లు భావిస్తున్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వెళ్లిన తండ్రి నందులరాజు దారుణాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. హత్యకు గురయిన దీపిక మెడికల్ షాపు నిర్వహిస్తోంది