Wednesday, 4 November 2026

టీ.కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

4హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్‌, దళితులపై బూటకపు ప్రేమ కురిపిస్తున్నాయని టీ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దళిత వ్యతిరేకులకు మోడీ బాసటగా నిలుస్తున్నారని మండిపడ్డారు.  కేసీఆర్ దళితులను మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ 125 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీ  కాంగ్రెస్… అదే వేదికగా మోడీ, కేసీఆర్‌లపై విమర్శలు గుప్పించింది.
మోడీ పాలనలో దళితులపై దాడులు : దిగ్విజయ్ సింగ్  
అంబేద్కర్ 125 వ జయంతి వేడుకలను టీ కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో  ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో పాటు కొప్పులు రాజు, కుంతియా హాజరయ్యారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగి పోయాయని దిగ్విజయ్ ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ అన్నీ అబద్దాలే చెప్పారన్నారు.
దళితులపై కేసీఆర్‌ బూటకపు ప్రేమ : ఉత్తమ్
దళితులపై కేసీఆర్‌ బూటకపు ప్రేమను కురిపిస్తున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో సీఎం కమిషన్‌లను దండుకుంటున్నారని ఆరోపించారు.
అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : జానా 
అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. దళిత నాయకుడిగా జనాన్ని కదలించిన మానవతా వాది అంబేద్కర్‌ అని జానా కొనియాడారు. దళితులకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయాలని మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. హైద్రాబాద్‌లో  125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని టీ కాంగ్రెస్‌ నేతలు స్వాగతించార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *