Wednesday, 4 November 2026

తిరుమల కనుమ దారిలో ఎలుగుబంటి మృతి

3తిరుమల: తిరుమల కనుమదారిలో వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. రెండో కనుమదారిలోని లింకురోడ్డుకు సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎలుగుబంటి రహదారి దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలై చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *