Friday, 6 November 2026

టెక్నో స్కూళ్ల దోపిడీని అరికట్టాలి

ఏలూరు,జూన్‌15(జ‌నం సాక్షి ): ఆకర్షణీయమైన పేర్లతో కార్పొరేట్‌ స్కూళ్లలో వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. పేద మద్య తరగతి ప్రజలకు ఫీజులు భారంగా మారయని లిపారు. అనేక ప్రాంతాల్లో కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్థంగా అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయన్నారు. పాఠశాల పేరు చివర టెక్నో,ఈ-టెక్నొ,కాన్సెప్ట్‌ వంటి పేర్లు పెట్టివిద్యార్థులను తల్లిదండ్రులను నిలువునా దోచేస్తున్నాయన్నారు. తోకపేర్లను తొలగించాలన్న నిబంధనలు ఉన్నా ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదన్నారు. పాఠశాలలోనే పుస్తకాలు, యూనిఫాం,టై కొనాలనే నిబంధన విధిస్తున్నారని వాపోయారు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. పేదలకు అండగా ప్రైవేట్‌ స్కూళ్ల దోపిడీని అరికట్టాలన్నారు.