Monday, 2 November 2026

ట్రంప్ ను అడ్డుకుంటున్న రిపబ్లికన్లు

cassidy-the-challenge-rebranding-donald-trump-1200అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షపీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం అవుతాయి. ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు అధ్యక్షుడిగా పదవిని చేపట్టాడానికి ఆరుగురు రిపబ్లికన్లు సుముఖత చూపడం లేదు. ట్రంప్ ను వ్యతిరేకిస్తూ ఆరుగురు రెబల్స్ అపనమ్మక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు.  అంతేకాకుండా వీరు మరో 37మంది రిపబ్లికన్లను ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయొద్దని కోరుతున్నారు. ఎన్నికల్లో రిపబ్లికన్లు 290 ఎలక్టోరల్ కాలేజ్ స్ధానాల్లో  గెలుపొందగా, డెమొక్రాట్లు 232 స్ధానాల్లో గెలుపొందారు. 228 ఏళ్ల అమెరికా ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకూ 71మంది అధ్యక్ష అభ్యర్ధిపై అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఓట్లు తక్కువైనా, రిపబ్లికన్ల ఆధిక్యం గల హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ కు అనుకూలంగా ఉండటంతో అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *