Monday, 2 November 2026

సైబర్ భద్రత కోసం ప్రత్యేక పాలసీ

రాబోయే కాలంలో సైబర్ మోసగాళ్లతో జరిగే ఆన్‌లైన్ యుద్ధం.. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులకంటే ప్రమాదకరంగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల అవసరం ఎంతగానో ఉందని అన్నారు. సైబర్ భద్రతకోసం ఇప్పటికే ప్రత్యేక పాలసీ తీసుకువచ్చి ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ దేశాల తో జట్టుకట్టి ముందుకుసాగుతున్నామని తెలిపారు. ప్రత్యేకపాలసీ, టీహబ్ ఆవిష్కరణలతో సైబర్ దాడులను ఎదుర్కొనే నిపుణులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి చెప్పారు.సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న సైబర్ సెక్యూktrరిటీ కాన్‌క్లేవ్ 2.0ను మంగళవారం హెచ్‌ఐసీసీలో మంత్రి కేటీఆర్, కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అజయ్‌కుమార్, ఇజ్రాయెల్ ప్రధానికి సైబర్ భద్రత మాజీ సలహాదారు రామ్ లెవీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ రక్షణ గురించి మరింత అవగాహన కల్పించుకోవాలన్నారు. విద్యార్థులకు దీనిని పాఠ్యాంశాల్లో భాగం చేయాలని, తద్వారా వారి భవిష్యత్‌ను ప్రమాదరహితంగా తీర్చిదిద్దుకోవచ్చని అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రతలో సైబర్ భద్రతను భాగంగా మార్చాలని అన్నారు. రాష్ట్రం తరఫున ఇప్పటికే ప్రత్యేక పాలసీ తీసుకువచ్చి ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ దేశాలతో జట్టుకట్టిముందుకు సాగుతున్నామని తెలిపారు. దీనితోపాటు టీ హబ్ ఆవిష్కరణలతో కలిసి సైబర్ దాడులను ఎదుర్కొనే నిపుణులను తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *