తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలోకి గురువారం ఉదయం 5గంటల 22నిమిషాలకు గృహప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతిభవన్’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం నివాసం, సమావేశం మందిరం,క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. సమావేశ మందిరానికి ‘జనహిత’గానామకరణం చేశారు. ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఈ నూతన భవన సముదాయాలను నిర్మించారు.
తొమ్మిది ఎకరాలలో కెసిఆర్ భవనం




