Tuesday, 3 November 2026

ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ: ఐదుగురు మృతి

tractor-lorry-accident

కడప: వైఎస్ఆర్ జిల్లాలోని దువ్వూరు మండలం ఏకోపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 28 మంది గాయపడ్డారు. క్రిష్ణంపల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్‌లో కడపకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఆలకుంట పెద్దయ్య (40), గంపా బాలరాజు (35), ఆలకుంట వెంకటరమణ (28), గంపా బాలకృష్ణా (20), బత్తల లక్ష్మీ ప్రసన్న(39) మృతి చెందారు.

ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని… మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *