Monday, 2 November 2026

డంప్‌యార్డులో రూ.కోటి నగదు బ్యాగ్ లభ్యం

p80xpd5hహైదరాబాద్ జవహర్‌నగర్ డంప్‌యార్డులో కోటి రూపాయలన నగదు ఉన్న బ్యాగ్ దొరికింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉదయం విధి నిర్వహణ‌కు వచ్చిన సెక్యూరిటీ గార్డులు డంప్‌యార్డును పరిశీలిస్తుండగా… అక్కడి డంప్ ఆపరేటర్‌ ఓ బ్యాగ్‌తో వెళ్తూ కనిపించాడు. దీనిపై అనుమానం వచ్చిన సెక్యూరిటీగార్డులు బ్యాగ్‌ను పరిశీలించగా అందులో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని డంప్ ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్యాగ్‌లో కోటి రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది… ఎవరూ పెట్టారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *