బాలినేని సమక్షంలో వైకాపాలో చేరికలు

ఒంగోలు,జూలై2(జ‌నం సాక్షి ): వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో పలువురు వైకాపాలో చేరారు. ఇందులో సోమవారం ఉదయం ఒంగోలులోని బాలినేని నివాసంలో కొత్తపట్నం మండలంలో తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్న పురిణి శ్రీనివాసరెడ్డితో పాటు సుమారు 150 మంది వైసిపి పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. పార్టీ కండువా వేసి వారిని బాలినేని ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… కొత్తపట్నం మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్రారెడ్డి, వీఆర్సీ రెడ్డి, డాక్టర్‌ రాఘవ, గాలి ముసలరెడ్డి, మండల యూత్‌ నాయకులు జీ. రమేష్‌ మాటూరి బ్రహ్మయ్య, పురిణి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.